Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-సుజాతనగర్
మంగపేట గ్రామంలోని ప్రవేశ ద్వారాన్ని కూల్చివేయడం హేమమైన చర్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. భద్రాచలం-ఖమ్మం జాతీయ రహదారిపై వేపలగడ్డ దగ్గర్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులలో భాగంగా మంగపేట గ్రామంలో కూల్చివేసిన ప్రవేశ ద్వారాన్ని సోమవారం పరిశీలించి మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 2006లో సుదీర్ఘంగా చేపట్టిన ''బంజారా పోరు బాట పాదయాత్ర''కు గుర్తుగా నిర్మించుకున్న కట్టడాన్ని ఆర్అండ్బి అధికారులు రాత్రికి రాత్రి కూల్చివేసి గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. రహదారి విస్తరణకు ఈ కట్టడం అడ్డుగా ఉండటం లేదని తక్షణమే వేరొక కట్టడాన్ని నిర్మించి ఇవ్వాలని లేనియెడల గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోతు ధర్మ, గండమళ్ల భాస్కర్ ,ఉడుగుల శ్రీకాంత్, జగన్, మాన్య తదితరులు పాల్గొన్నారు.