Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22, 23 వార్డుల సింగరేణి భూములను రెవెన్యూకు అప్పజెప్పాలి
- సమస్యలు యాజమాన్యం దృష్టికి తెచ్చిన మున్సిపల్ చైర్మెన్
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి పుట్టిల్లు బొగ్గుటకు నలువైపులా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని మున్సిపల్ చైర్మెన్ వెంకటేశ్వరరావు కోరారు. జవహర్ ఉపరితల బొగ్గు గని పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా గురువారం మాట్లాడారు. పట్టణానికి స్వాగతం పలికేందుకు నాలుగు వైపులా నాలుగు వెల్కమ్ బోర్డులు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు పుట్టినిల్లు సింగరేణి అని ఉట్టిపడేలా ఇల్లందులోకి ఎంటర్ అయ్యే ప్రజలకు స్వాగతం పలికేందుకు వెల్కమ్ బోర్డులు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని కోరారు. గతసారి ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణలో కూడా ఈ అంశం లేవనెత్తానని తెలిపారు. ఈ సారి తప్పకుండా వెల్కం బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.
ఆర్అండ్ఆర్ కాలనీ కాటిల్ షెడ్ సమస్య పరిష్కారించాలి
ఆర్అండ్ఆర్ ప్యాకేజ్‌లో భాగంగా ప్రజలకు క్యాటిల్ షెడ్ కోసం స్థలం సింగరేణి యాజమాన్యం కేటా యించాలని కోరారు. గతంలో సింగరేణి అధికారులు మాట పూర్వకంగా కేటాయించారని చెప్పి అదే భూ మిని ఇల్లందు మున్సిపాలిటీ వారికి లేఅవుట్లో గ్రీన్ ల్యాండ్‌గా ఇవ్వడం జరిగింది. కావున అధికారులు దృష్టి సారించి ఆర్ఎన్ఆర్ కాలనీ ప్రజలకు రాతపూర్వకంగా కాటిల్ షెడ్లు కేటాయించవలసిందిగా కోరారు.
ఇల్లందులో మ్యూజియం ఏర్పాటు చేయాలి
బొగ్గు పుట్టిందే ఇల్లందులో అలాంటి ఇల్లందులో సింగరేణి యాజమాన్యం సంబంధించి ఎలాంటి గుర్తులు లేకపోవడం శోచనీయం. అధికారులు దృష్టి సారించి బొగ్గు పుట్టినిల్లు ఉట్టిపడేలా మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు.
మున్సిపాలిటీ 22, 23 వార్డుల సింగరేణి భూములను రెవెన్యూ వారికి అప్పజెప్పాలి
గతంలో పంచాయతీలుగా ఉన్న మున్సిపాలిటీలో విలీనమైన 22, 23 వార్డులలో సింగరేణి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉన్న భూములను రెవెన్యూ వారికి అప్పజెప్పడం వలన అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు రెగ్యురలేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
జెకె సెంటర్ నుండి డి బ్లాక్ వరకు రోడ్డును వెడల్పు చేసి డివైడర్లు ఏర్పాటు చేయాలి
నిత్యం సింగరేణి కార్మికులు తిరిగేటువంటి జెకె సెంటర్ నుండి డి బ్లాక్ వరకు వెళ్లే రోడ్డును వెడల్పు చేసి డివైడర్లు ఏర్పాటు చేయాలి.
బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న గృహాలకు రిపేర్లు చేయించాలి
గతంలో బ్లాస్టింగ్స్ వలన ఇబ్బంది పడ్డ 16, 17, 18, 20, 21 వార్డు ప్రజల సమస్యలు వెంటనే తీర్చాలి. ఆయా వార్డులలో నివాసముంటున్న ఇల్లందు పట్టణ ప్రజల నివాస గృహాలు కొంతమేరకు క్రాకులు వచ్చాయి. అట్టి వాటిని పరిశీలించి నివాస గృహాలు మరమ్మతులు చేయాలి.
డిఎంఎఫ్టి, సిఆర్సిసి నిధులు కేటాయింపు చేయాలి
సింగరేణి పుట్టినిల్లు ఇల్లందుకు పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు డీఎంఎఫ్టీ సీఆర్సీసీ నిధులు అధిక మొత్తంలో ఇల్లందుకి కేటాయించాలి. పట్టణ అభివృద్ధిలో సింగరేణి యాజమాన్యం భాగస్వాములు కావాలి.
కబ్జాకు గురవుతున్న సింగరేణి భూములను కాపాడాలి
కబ్జాకు గురవుతన్న సింగరేణి భూములు కాపాడుకునేందుకు ఉమ్మడి సర్వే నిర్వహించాలి. గతంలో సింగరేణి అధికారులకు, రెవెన్యూ అధికారులకు మున్సిపల్ చైర్మన్‌గా ఫిర్యాదు చేయడం జరిగింది. వారి దగ్గరుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడైనా సింగరేణి అధికారులు దృష్టి సారించి ఉమ్మడిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సింగరేణి అధికారులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి సింగరేణికి బార్డర్ లైన్స్ వేయవలసిందిగా కోరారు. సింగరేణి పుట్టిల్లు నుండి సింగరేణి దూరం చేయవద్దని తెలిపారు.