Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
మేడే స్ఫూర్తితో దేశ ఐక్యతకు విఘాతం కలిగించే మతోన్మాద, కార్మిక వర్గ వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం ద్వారా మాత్రమే కార్మిక వర్గం హక్కులను, దేశాన్ని కాపాడుకోగలమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం), సిఐటియు ఖమ్మం త్రీ టౌన్ కమిటీల ఆధ్వర్యంలో వివిధ యూనియన్ల జెండాలను మేడే దినోత్సవం సందర్భంగా ఎర్ర జెండాను ఎగరవేశారు. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, పోరాడితే పోయేదేమీ లేదని బానిస సంకెళ్లు తప్ప అని కార్మిక వర్గం నినదించడం జరిగింది అని అన్నారు. అనంతరం బోసు బొమ్మ సెంటర్ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్‌లో భారీ బహిరంగ సభ త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడుతూ.. కొత్త హక్కుల కోసం కొట్లాడాల్సింది పోయి ఈ బిజెపి ప్రభుత్వంలో ఉన్న హక్కులను పరిరక్షించుకోవడం కోసం కార్మిక వర్గం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బ్రిటిష్ కాలంలో పోరాడు సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం నేడు తొలగించబడుతుందన్నారు. రోజు 8 గంటల పని దినం కోసం మరో చికాగో పోరాటాన్ని మన దేశంలో నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మనుధర్మం ఆధారంగా ప్రభుత్వ పాలన కొనసాగించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను సిబిఐ, ఈడి వంటి సంస్థలను ఉపయోగించి నిర్బంధాలకు గురిచేస్తుందన్నారు.ఎదురు తిరిగిన వారిని హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదన్నారు.కావున రాజ్యాంగం కల్పించబడిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును స్వతంత్రంగా ఉపయోగించుకునే లాగా మేడే స్ఫూర్తితో ఐక్యతను చాటి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణ వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, పి.విష్ణు, తుషాకుల లింగయ్య, త్రీటౌన్ నాయకులు బండారు యాకయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, ఎస్కే సైదులు, కార్పొరేటర్లు ఎర్ర గోపి, యల్లంపల్లి వెంకట్రావు, పార్టీ నాయకులు పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, బండారు వీరబాబు, షేక్ ఇమామ్, ఎస్.కె బాబు, బజ్జూరి రమణారెడ్డి, పోతురాజు జార్జి, మద్ది సత్యం, వేల్పుల నాగేశ్వరరావు, యస్‌కె ఖాశీం, గబ్బెటి పుల్లయ్య, రంగు హనుమంతచారి, అలివేలు, తదితరులు పాల్గొన్నారు.
చింతకాని : కార్మిక వ్యతిరేక చట్టాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు ప్రతి కార్మికుడు విశ్రమించవద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు పేర్కొన్నారు. చింతకాని మండలం పాతర్లపాడులో జరిగిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం మేడే చరిత్రను వక్రీకరిస్తుందని ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణకై పోరాటాలే, మార్గం అన్నారు మోడీ సర్కార్ తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రవీకరణను వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లందర్నీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సామినేని రామారావు, పార్టీ మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, కాటబత్తిన వీరబాబు, గోపయ్య, దేశబోయిన ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
బోనకల్ : సిపిఎం గోవిందాపురం ఎల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కన్వీనర్ ఏడు నూతల లక్ష్మణరావు సిపిఎం మండల కమిటీ సభ్యులు, ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రం నాయకులు కళ్యాణపు శ్రీనివాసరావు ఉపసర్పంచ్ కారంగుల చంద్రయ్య, కళ్యాణపు బుచ్చయ్య, పొన్నం రాంబాబు, బండి చందర్రావు, వల్లంకొండ సురేష్ శాఖ కార్యదర్శి కాట కోటయ్య సిపిఎం మహిళా శాఖ కార్యదర్శి నల్లమోతు వాణి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : తెలంగాణ స్టేట్ యునైటెడ్ విద్యుత్ శాఖ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీసీఎల్ కార్యదర్శి ఎం.ప్రసాద్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు బి.పుష్ప రాణి, కార్యదర్శి కామినేని నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ అధ్యక్షులు ఎన్ .సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి యన్. సీతయ్య, ఖమ్మంటౌన్ డివిజన్ అధ్యక్షులు లాలయ్య, వైరా డివిజన్ అధ్యక్షులు గుండేల గురునాథం, వైరా డివిజన్ కార్యదర్శి బి.రాజేష్, జిల్లా ట్రెజరర్ ఏ.కృష్ణమూర్తి, మహిళ ప్రతినిధి. సంధ్య రూరల్ సబ్ డివిజన్ కార్యదర్శి గంటా శ్రీనివాసరావు, జిల్లా సెంటర్ బాధ్యులు సిహెచ్ కమలాకర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్‌రావు, బిల్ కలెక్టర్ల సీనియర్ నాయకులు పి.సత్యనారాయణ పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం నందు బీఆర్ఎస్ కెవి, మున్సిపల్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నగర మేయర్ పునుకోల్లు నీరజ సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు చేతుల మీద జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర తెలంగాణ యూనియన్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు సెక్రటరీ జ్యోతి, కిరణ్, తిరుమల్‌రెడ్డి, జావిద్ బాబు, సత్య, కరుణాకర్, లక్ష్మీనారాయణ, గుమ్మడి రమేష్, వెంకటేష్, గౌస్, ప్రసాద్, పథ్వి, రాము, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : ఖమ్మం నగరంలోని వన్‌టౌన్ పరిధిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ. జబ్బార్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ.జబ్బర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు నాగులు మీరా, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కూరపాటి శ్రీనివాస్, 40వ డివిజన్ సెక్రెటరీ కూరపాటి సతీష్, సిఐటియు నాయకులు హుస్సేన్, మేస్త్రి ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : మతం పేరుతో కార్మికులను విచ్చనం చేసే శక్తుల పట్ల ఆర్టీసీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీరంగంలో మతోన్మాదశక్తులకు స్థానం లేదని భారత కార్మిక సంఘాల కేంద్రం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తిలు పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలోని 137వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఖమ్మంలోని సిహెచ్.వి.రామయ్య స్మారక భవనం వద్ద గుండు మాధవరావు అధ్యక్షతన శ్వేతారుణ పతాకాన్ని కళ్యాణం వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, రీజినల్ కార్యదర్శి పిట్టల సుధాకర్, ప్రచార కార్యదర్శి తోకల బాబు, ఖమ్మం డిపో కార్యనిర్వాహక అధ్యక్షులు గుర్రం రామారావు, ఉపాధ్యక్షులు బసవయ్య, డిపో కమిటీ ప్రచార కార్యదర్శి పగిళ్లపల్లి నరసింహారావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఆర్టీసీ ఎస్డబ్ల్యుఎఫ్ నాయకులు జాజుల నాగేశ్వరరావు, కోశాధికారి గుగ్గిళ్ళ రోశయ్య, కొలిపాక శ్రీహరి, గాలి నాగేశ్వరరావు, బుగ్గవీటి లింగమూర్తి పాల్గొన్నారు.
ఖమ్మం : మోడీ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే దేశాన్ని తూకంలో పెట్టి మరీ బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మడం ఖాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం సీపీఎం ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత రమణగుట్ట, బూరన్ పురం, ఎన్ఎస్టీ రోడ్, రేవతి సెంటర్, మామిళ్ళగూడెం తదితర ఏరియాలో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, హుస్సేన్, నాగరాజు, భద్రం, వెంకన్న, గౌస్, బుడేన్, ఉపేంద్ర నాయక్, రవీంద్ర, కుమారి, జె వెంకన్న బాబు, ఫకీరు సాహిబ్, శోభారాణి, జలగం అనిల్ కుమార్, లోకేశ్వరావు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు
కారేపల్లి : ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే ను కార్మిక, కర్షకులు సోమవారం కారేపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు.. కారేపల్లిలో సిపిఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభధ్రం, జిల్లా కమిటి సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, వజ్జా రామారావు, ఎంపీటీసీ వడ్డె అజరుబాబు, సర్పంచ్‌లు బానోత్ బన్సీలాల్, హలావత్ ఇంధిరాజ్యోతి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఉపసర్పంచ్లు భాగం వెంకటప్పారావు, వజ్జా నరేష్, సిపిఎం నాయకులు కరపటి సీతారాములు, మాలోత్ రాంకోటి, ముండ్ల ఏకాంబరం, సీఐటీయు నాయకులు జి.నర్సింహారావు, గుర్రం వెంకటేశ్వర్లు, శ్యామ్‌లాల్, బాదావత్కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు కొల్లి వీరయ్య పాల్గొన్నారు.
సత్తుపల్లి : స్థానిక కిన్లే బాట్లింగ్ కంపెనీ (గోల్డ్‌స్పాట్ ఫ్యాక్టరీ) వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, కొలికపోగు సర్వేశ్వరరావు ప్రజా సంఘాల నాయకులు రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, మోరంపూడి వెంకటేశ్వరరావు, జంగా సత్యనారాయణ, గోల్డ్‌స్పాట్ యూనియన్ నాయకులు ప్రసాద్, రాజేశ్, జిలాని, మట్టపర్తి సత్యనారాయణ, రమేశ్, హమాలి సంఘ నాయకులు బాజీ, సైదా, బాషా, ఆర్టీసీ నాయకులు కృష్ణారెడ్డి, సుధాకర్, జగన్నాధం, వెంకటయ్య, దాసు, శంకర్ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : ఎర్రుపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో సిఐటియు, సిపిఎం పార్టీల జండాల ను ఎగుర వేసి మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, నాయకులు సగుర్తి సంజీవరావు, రామిశెట్టి సురేష్, షేక్ నాగుల మీరా, నాగులవంచ వెంకటరామయ్య, ఆంగోతు వెంకటేశ్వర్లు, గొల్లపూడి కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, గామాసు జోగయ్య పాల్గొన్నారు.
ఖమ్మం : నగరంలోని 43 వ డివిజన్ రేవతి సెంటర్లో మే డే ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ కార్పొరేటర్ శోభారాణి సీపీఎం జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండీ గౌస్ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి చెరుకుపల్లి వీరభద్రం, సీఐటీయూ రాష్ట్ర నాయకులు బుర్రి వెంకటేశ్వర్లు, కనకదుర్గ, కృష్ణ, అబ్బు పాల్గొన్నారు.
వైరాటౌన్ : మిషన్ భగీరథ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వైరా హెడ్ వర్క్స్ నందు మిషన్ భగీరథ వైరా మండలం అధ్యక్షుడు గొడ్ల నరసింహారావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు మాట్లాడారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, అనుమోలు రామారావు, ఐద్వా నాయకురాలు మచ్చా మణి, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, ఇమ్మడి సుధీర్, మల్లెంపాటి రామారావు, డివైఎఫ్ఐ నాయకులు చిత్తారు మురళి తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి : ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను సోమవారం మండలంలోని సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ ప్రజాపందా, కాంగ్రెస్, సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, బిఆర్ఎస్, బిఆర్ఎస్కేయు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయు జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఉండేమోదుగుల జనార్దన్ రావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సిపిఎం నాయకులు ఏటుకూరి రామారావు, రచ్చ నరసింహారావు, దుగ్గి వెంకటేశ్వర్లు, ఏరదేశి నరసింహారావు, కట్టెకోల వెంకన్న, బండి రామమూర్తి, రాసాల కనకయ్య, బెల్లం లక్ష్మి, డేగల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు గోపి పాల్గొన్నారు.
ముదిగొండ: సిపిఐ(ఎం), సిఐటియు ఆధ్వర్యంలో ముదిగొండలో పలు సెంటర్లో ఉన్న పార్టీ దిమ్మెలు వద్ద సిపిఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం జండా ఆవిష్కరణలు నిర్వహిం చారు. అనంతరం వెంకటాపురం గ్రామము నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్, బండి పద్మ, మండల నాయకులు రాయల వెంకటేశ్వర్లు, కందుల భాస్కరరావు, టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, రాయల శ్రీనివాసరావు, మందరపు వెంకన్న, ఇరుకు నాగేశ్వరరావు, ఐద్వా మండల అధ్యక్షులు మందరపు పద్మ, సిఐటియు నాయకులు బట్టు హనుమంతరావు, పుచ్చకాయల లక్ష్మయ్య, డివైఎఫ్ఐ అధ్యక్షకార్యదర్శి బట్టు రాజు, మెట్టెల సతీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : ఖమ్మంలోని ఆటో అడ్డాలు, ట్రాక్టర్ అడ్డాలు, రైల్వే స్టేషన్, బస్టాండ్, కాలువొడ్డు, ఖానాపురం అడ్డాలలో మేడే జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఖమ్మంలోని మంచికంటి భవనంలో సిఐటియు జిల్లా 37వ ట్రాక్టర్ యూనియన్ మహాసభ జరిగింది . ఈ మహసభలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, సిఐటియు యూనియన్ జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణ వెంకటేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వై విక్రమ్, జిల్లా కార్యదర్శి జిల్లా ఉపేందర్, ట్రాక్టర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ధరావత్ రాందాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మికవర్గ ఐక్యతకు సంకేతమని కార్మికవర్గ చైతన్యానికి ప్రతి రూపమన్నారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటైన కాలానికి నిలువెత్తు సాక్ష్యమని అన్నారు. మేడే స్ఫూర్తికి బిజెపి ప్రభుత్వం తూట్లుపోడుస్తున్నదని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు పి.రమ్య, టూ టౌన్ కన్వీనర్ కాంపాటి వెంకన్న, సిఐటియు నాయకులు లక్ష్మణ్, కోటి, కనకారావు, కాసిం, వెంకట్, శ్రీను, నాగేశ్వరరావు, నరసయ్య, నరసింహారావు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మండలంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మండలంలోని తెల్దారుపల్లి, నాయుడుపేట, ఆరెకోడు, కాచిరాజుగూడెం, ఏదులాపురం గ్రామాల్లో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలుచోట్ల పార్టీ పతాకాన్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించి ప్రసంగించారు. బిజెపి అధికారం చేపట్టాక 44 లేబర్ కోడ్లను రద్దు చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సిపిఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలు, ఆందోళనలకు కార్మికులంతా ఐక్యంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో సిపిఎం పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు ఉరడి సుదర్శన్‌రెడ్డి, సీపీఎం సీనియర్ నాయకులు సిద్దినేని కోటయ్య, బత్తినేని వెంకటేశ్వరరావు, మామిండ్ల సంజీవ రెడ్డి, తమ్మినేని వెంకట్రావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు తోట పెద్ద వెంకటరెడ్డి, నందిగామ కృష్ణ, పొన్నెకంటి సంగయ్య, పి.మోహన్‌రావు, యామిని ఉపేందర్, పెండ్యాల సుమతీ, మండల నాయకులు వై.ప్రసాద్‌రావు, గుమ్మడి నరసయ్య, పొన్నం వెంకట రమణ, ఏటుకూరి పద్మ, రంజాన్ పాష, పల్లె శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఖమ్మం : నగరంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్పెంటర్ యూనియన్ రాడ్ బెండింగ్ యూనియన్, పెయింటర్స్ యూనియన్, మార్బుల్ వర్కర్స్ యూనియన్స్ కూడా జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, పెరుమాళ్ళపల్లి మోహన్‌రావు, మేడికొండ నాగేశ్వరరావు, ఎర్ర మల్లికార్జున్, గూడ రాంబ్రహ్మం గౌడ్, దోనోజు పాపాచారి, టీవీ రమణ, లింగా కృష్ణ, పావురాల నాగేశ్వరరావు, జంగం నగేష్ తదితరులు పాల్గొన్నారు.
మధిర : నిధానపురం, నక్కలగరుబు, సిరిపురం, అల్లినగరు, అత్కుర్ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మద్దాల ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు, మండల కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు నాయుడు శ్రీరాములు, దొంతి వీరాచారి తదితరులు పాల్గొన్నారు.
మధిర : సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సివిల్ సప్లై మార్కెట్ యార్డ్, వడ్డెర బజార్, రాయపట్నం సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం సెంటర్, లడక్ బజార్, ప్రకాశం రోడ్డు, ఆర్టీసీ డిపో, ఎలక్ట్రికల్ ఈఆర్వో ఆఫీస్, జయశంకర్ తెలంగాణ వ్యవసాయ క్షేత్రం, 19 వ వార్డు, కళామందిర్ సెంటర్, బంజారా కాలనీ, ఆర్డబ్ల్యూఎస్ యూనియన్ ఆఫీస్, ఎలక్ట్రికల్ ఆఫీస్ లో జెండా ఎగరవేసి ఘనంగా జరిపారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం. నరసింహారావు, పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, సిఐటియు నాయకులు మురళి, తేలబ్రోలు రాధాకృష్ణ పాల్గొన్నారు.
కార్మిక, కర్షకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మేడే ర్యాలీలో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం వీరోచిత పోరాటం చేసి అమరవీరులు హక్కులను సాధించుకున్నారని, వారి పోరాట స్ఫూర్తితో కార్మిక, కర్షకుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద గల బీఆర్ఎస్ కెవి సంఘం కార్యాలయంలో కార్మిక జెండాను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు ఏకరూప దుస్తులను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.అనంతరం నగరంలోని పలు చోట్ల బీఆర్ఎస్ కెవి జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకోల్లు నీరజ, సూడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ దొరేపల్లి శ్వేత, మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షి మల్లేశం, మార్కెట్ వైస్ చైర్మన్ షేక్ అఫ్టల్, ట్రేడ్ యూనియన్ నాయకులు నున్న మాధవరావు, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇంచార్జ్ ఆర్జెసి కృష్ణ, కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : మండలంలో మే డే సందర్భంగా సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కార్మిక సంఘాలు ఎర్రజెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విట్టల్‌రావు, సిఐటియు మండల అధ్యక్షులు తాండ్ర రాజేశ్వరరావు, తాపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కొప్పుల గోవిందరావు, హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మిద్దెస్వామి, సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, కండే సత్యం, నాగమణి, గుడిమెట్ల బాబు పాల్గొన్నారు.
వైరాటౌన్: సిఐటియు వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు నిర్వహించారు. వైరా రింగ్ రోడ్ సెంటర్ నందు జరిగిన సభలో సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అను మోలు రామారావు, సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, సిఐటియు సీనియర్ నాయకులు షేక్ జమాల్, నూకల వెంకటేశ్వర్లు, రాము, గిరి, రవి, పట్టయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.
వైరా : మేడే సందర్భంగా నియోజక వర్గ కేంద్రం వైరా క్రాస్ రోడ్డులో ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ గులాబీజెండా ఎగురవేసి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వైరాలో మిషన్ భగీరథ కార్మిక విభాగం బిఆర్టియు, మున్సిపాలిటీ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మిక విభాగం అధ్యక్షులు మద్దెల రవి, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, జడ్పిటిసి నంబూరు కనకదుర్గ, మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహ్మద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, కౌన్సిలర్ వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ దారెల్లి కోటయ్య, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : కార్మికులు తమ హక్కులను రక్షించుకోవాలంటే బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. సిపిఐ(ఎం) పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని వైరా పట్టణం, గండగలపాడు, లాలాపురం, సోమవారం, బ్రాహ్మణపల్లి, పల్లిపాడు గ్రామాలలో సోమవారం మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బోడెపుడి భవనం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మల్లెంపాటి వీరభద్రరావు, మల్లెంపాటి ప్రసాదరావు, చింతనిప్పు చలపతిరావు, బోడపట్ల రవీందర్, మల్లెంపాటి రామారావు, మచ్చా మణి, బొంతు సమత, హరి వెంకటేశ్వరరావు, కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు, అనుమోలు రామారావు పాల్గొన్నారు.
కల్లూరు : ప్రపంచ కార్మికుల ఐక్య దినోత్సవం సందర్భంగా సోమవారం వాడ వాడన ఎర్రజెండా ఎగరేసి మే డే దినోత్సవం కార్మిక సంఘాలు ఘనంగా పట్టణంలో ర్యాలీలు మేళతాళాలతో నిర్వహించారు. లింగాల గ్రామంలో సీనియర్ నాయకులు మట్టూరి భద్రయ్య ఆవిష్కరించారు. చెన్నూరు గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, చందుపట్ల గ్రామంలో సురేష్, బట్టు నరసింహారావు, తాళ్లూరు వెంకటపురంలో ముదిగొండ అంజయ్య, పలు గ్రామాల్లో పార్టీ నాయకులు జండా ఆవిష్కరించారు. కల్లూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఉప్పు నరసింహారావు. ఎలక్ట్రిషన్ సంఘం ఆధ్వర్యంలో జయరాజు ధర్నాసి బాలరాజు, ఐఎఫ్‌టి యు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఏ వెంకన్న రిక్షా కార్మికులు ఆటో కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాడవాడనా ఎర్రజెండా రెపరెపలాడింది. భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
కార్మికుల హక్కులకై పోరాడుదాం !
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కార్యాలయం కార్యదర్శి ఆర్.ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సభలో తొలుత జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక లోకమంతా ఐక్యమై తిరుగుబాటుకు సిద్దం కావాలన్నారు. వ్యవస్థపై దోపిడీవర్గం ఆధిపత్యం చెలాయిస్తూ శ్రమదోపిడీ చేస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా తిరగబడాల్సిన కర్తవ్యాన్ని ఈ మేడే గుర్తు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, పార్టీ రాష్ట్ర నాయకులు యం.సుబ్బారావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, పి.ఝాన్సీ, మెరుగు సత్యనారాయణ, జిల్లా నాయకులు కె.దేవేంద్ర, వై.శ్రీనివాసరావు, అఫ్జల్, మెరుగు రమణ, కోదాటి గిరి, సుబ్బారావు పాల్గొన్నారు.
పెట్టుబడిదారులకు మీడియా ఊడిగం
టీడబ్ల్యూజేఎఫ్జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ - ఖమ్మంరూరల్
పెట్టుబడిదారులకు మీడియా ఊడిగం చేస్తోందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దోపిడీ విధానాలపై ప్రశ్నించిన కమ్యూనిస్టులు, జర్నలిస్టులను అణచివేసేందుకు పెట్టుబడిదారులు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆరోపించారు. నవతెలంగాణ ఖమ్మం ఎడిషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎర్ర జెండాను మేడే సందర్భంగా సోమవారం ఆవిష్కరించారు. పెట్టుబడిదారీ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులు భావ ప్రకటన స్వేచ్ఛకు సైతం దూరమవుతున్నారని వాపోయారు. పోరాడి సాధించుకున్న శ్రామిక హక్కులు కార్మికులు, జర్నలిస్టుల పనిగంటలు ఏ పెట్టుబడిదారీ సంస్థల్లోనూ అమలు కావడం లేదని తెలిపారు. పాలక పక్షాలు సైతం మీడియాను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని, అనుకూలంగా వార్తలు రాస్తే సరే సరి... లేదంటే వివిధ రూపాల్లో దాడులకు పాల్పడే విష సంస్కృతి కేంద్రంలో బీజేపీ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అధికమైందన్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ జర్నలిస్టులపై పీడీ యాక్టులు నమోదు చేయడం, జైళ్లలో నిర్బంధించడం సరైంది కాదన్నారు. జర్నలిస్టులు, శ్రామికుల హక్కుల కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 'పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప' అన్న కారల్‌మార్క్స్ సిద్ధాంతస్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నవతెలంగాణ రీజనల్ మేనేజర్ ఎస్డీ జావీద్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు చేబ్రోలు నారాయణ, కె.శివారెడ్డి, జె.కృష్ణ, బంక వెంకటేశ్, ఇ.వెంకటేశ్వర్లు, కష్ణ, యాకూబ్, బీరయ్య పాల్గొన్నారు.
కార్మికుల హక్కులను హరించి వేస్తున్న
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : వైఎస్ షర్మిల
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తు, వారికి సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు కూడా లేకుండా చేస్తున్నాయని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. మే డే సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం సాయిగణేశ్ నగర్ లోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను సోమవారం ఎగురవేశారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాటం చేస్తే కనీసం వారికి గౌరవం కూడా ఇవ్వలేదన్నారు.విద్యుత్తు శాఖలో కార్మికులు సమ్మె చేస్తే వారిని భయబ్రాంతులకు గురిచేసి సమ్మెను విచ్ఛినం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ,ఖాజీపేట రైల్వేకోచ్ పరిశ్రమను ఏర్పాటు చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తుందని ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ గడిపల్లి కవిత, నాయకులు రాము, నంద్యాల రవీందర్ రెడ్డి, వెంకయ్య, యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.
శ్రామిక హక్కులను హరించే కుట్ర
నవతెలంగాణ దినపత్రిక ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎస్డీ జావీద్
నవతెలంగాణ - ఖమ్మంరూరల్
పోరాడి సాధించిన శ్రామిక హక్కులను హరించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నవతెలంగాణ దినపత్రిక ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎస్డీ జావీద్ అన్నారు. ' నవతెలంగాణ' ఖమ్మం ఎడిషన్ కేంద్రంలో సోమవారం నిర్వహించిన మేడే వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు చేసే కుటిలయత్నానికి బిజెపి పూనుకుంటుందన్నారు. శ్రామిక వర్గ హక్కులను హరించి వేసేందుకే కార్మిక కోడులను తెచ్చుతోందని చెప్పారు. ఓ వైపు కార్మిక హక్కులను కాపాడుకుంటూనే మరోవైపు సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని తెలిపారు. బిజెపి దురంహంకార పూరిత విధానాలతో మల్లయోధులు ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు. దేశం కోసం పతకాలు సాధించిన రేజ్లర్ ను లైంగికంగా వేధించిన బిజెపి ఎంపీ పై చర్యలు తీసుకోకపోవడం, కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప కేసు కూడా నమోదు చేయక పోవడం మోడీ ప్రభుత్వ దుర్మార్గ పూరిత విధానాలకు నిదర్శనంగా పేర్కొన్నారు. శ్రామికవర్గ పక్షపాతిగా నవతెలంగాణ వ్యవహరిస్తుందన్నారు. అంతకుముందు ఎర్రజెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు కె.శ్రీనివాసరెడ్డి, ఇ. వెంకటేశ్వర్లు, చేబ్రోలు నారాయణ, కె.శివారెడ్డి, కష్ణ, సిబ్బంది యాకూబ్, బంక వెంకటేశ్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.