Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ బిల్లులను చెల్లించాలి
- సర్పంచుల సంఘం యాలాల మండల ప్రధాన కార్యదర్శి ఎ. శివకుమార్, మండల కార్యదర్శి మిత్రు నాయక్
నవతెలంగాణ- యాలాల
కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు సర్పంచుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని దేవనూర్ సర్పంచ్, సర్పంచుల సంఘం యాలాల మండల ప్రధాన కార్యదర్శి ఆకుల శివ కు మార్, బషీర్ మియా తండ జి.పి. సర్పంచ్, సర్పచుల సంఘం మండల కార్యదర్శి వర్త్యా మిత్రు నాయక్ సోమ వారం పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామాలలో సర్పంచులు అందరూ భాధ్యతగా అమలు పరుస్తూ విజయవంతం చేస్తున్నామన్నారు. డబ్బులు లేక వడ్డీలకు అప్పు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులను చేయించామని తెలిపారు. 3 నెలల క్రితం ఎస్టీఓ కార్యాలయంలో జీపీకి సంబంధించిన చెక్కుల ను జమ చేశామని చెప్పారు. కానీ ఇప్పటీ వరకు డబ్బులు రాలేద న్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ సర్పంచుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మాది రిగా సర్పచులకు కూడా గౌరవ వేతనాలు పెంచి, హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా సర్పచుల పదవి కాలం పూర్తైయ్యాక రూ. 5 వేలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.