Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ జలంధర్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్ఐ ఏడుకొండలు అన్నారు. సోమవారం గోనూరు గ్రామంలో సర్పంచ్ గోవింద్ అధ్యక్షతన పోలీసు మైత్రీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. గ్రామంలో అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి ఇతరులకు కూడా అవగాహన కల్పించేం దుకు ముందుకు రావాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు ఒక సీసీ కెమెరా వెయ్యిమం దితో సమానం అన్నారు. ఈ నెల 10వ తేదీన మెగా లోకా అదాలత్ ఉంటుందని చెప్పారు. పాత కేసులు ఉంటే రాజీ కుదుర్చుకోవచ్చని తెలిపారు. అర్థరాత్రి ఇసుక తరలిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని, నిఘా పెంచుతామని తెలి పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పావని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోవింద్, గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.