Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యుల సలహాలు పాటించడం తప్పనిసరి
నవతెలంగాణ-దోమ
ఎండాకాలం ప్రారంభం నుండే ఎండలు భగ్గుమంటు న్నాయి. ఉదయం నుండే వేడి వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేక పోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు.
తలనొప్పి, ఒళ్లుమంట, డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు వేసవి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొం టారు. కొన్ని సమయాల్లో ఎండ వేడిమిని తట్టుకోలేక వయస్సు పై బడిన వారు ప్రాణాలను కూడా కోల్పోతుం టారు. కాబట్టి వద్ధులు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలంటు న్నారు. ఆహార నియమాల నుంచి నిద్ర వరకు వైద్యుల సలహాలు పాటించాలి. వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వలన వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. వడదెబ్బ చాలా ప్రమాదకరమైనది. శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లేదా అంత కన్నా ఎక్కువ అవటాన్ని వడదెబ్బ తెగలటం అంటారు. సమయంలో వాంతులు, అలసట, బలహీనంగా అవటం, తలనొప్పి, కండరాల తిమ్మిరులు, కళ్ళు తిరగటం వంటి లక్షణాలు కనపడతాయి. వడదెబ్బ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బ నివారణ
వేసవి కాలంలో డీ-హైడ్రేషన్ అధికంగా ఉంటుంది. కావున నీళ్లను మీతో తీసుకెళ్ళండి. వేసవికాలంలో నీరు శరీరాన్ని చల్లగా మారుస్తుంది. వేసవి కాలంలో ఎక్కువ సమయం చెట్టునీడలో కానీ, చల్లగా వుండే ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించండి.అధిక ఉష్ణోగ్రత వల్ల,కలుషిత మైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలకు ఈ కాలంలో ఎక్కువగా జబ్బులు వస్తు ఉంటాయి. కావున పిల్లల విష యంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బయట వాతావరణం చాలా వేడిగా వుంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని తట్టుకునే శక్తి పిల్లలకు తక్కువగా ఉంటుంది. కావున వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది. పిల్లలు వుండేచోట పరిశుభ్రత లోపిస్తే చెమట వల్ల చర్మంపై ఏర్పడే వ్యర్థల వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయి.
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండ తీవ్రంగా సమయాల్లో పిల్లలని ఇళ్ళలోనే ఉండేవిధంగా చూసుకోవాలి. రోజూ పండ్ల రసాలు తాగించాలి. రెండు పూటల స్నానం చేయించాలి. పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినిపించాలి. మసాలాలు తగ్గించాలి. పలుచటి, మెత్తటి కాటన్ బట్టలు తొడగాలి. బయటికి వెళ్తే గొడుగు, టోపీ వాడాలి. దోమలు కుట్టకుండా రాత్రి పూట దోమతెరలు కట్టుకోవాలి. బయటి ఆహారం తినిపిం చకూడదు. ఆహారం ఎప్పటికప్పుడు తాజాగా ఉండేటట్లు చూసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న వైద్యులని సం ప్రదించి టీకాలన్నీ సకాలంలో వేయించుకొని వారి సూచనలు, సలహాలు పాటించాలి.
ఆరోగ్యన్ని కాపాడుకోవాలి
రానున్న రోజుల్లో ఎండ తీవ్రత అధికం అవుతున్న వేళల్లో ప్రజలు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యన్ని కాపాడుకోవాలి. వేసవి తపానికి నుంచి ఆరోగ్యం నీరసం కాకుండా, పోషకాలు తగ్గకుండా కొబ్బరి బొండాలను తీసుకోవాలి. వైద్యులను ఎప్పటికప్పుడు సంప్రదించాలి.
- డాక్టర్ మునీబ్ మండల వైద్యాధికారి దోమ.