Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ దేవంబోట్ల రాజు
నవతెలంగాణ-దోమ
ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనా ఉధృతిని అరికట్టాలని ఎస్ఐ రాజు తెలిపారు. సోమవారం మండల పరిధిలోని ఐనపూర్ గ్రామంలో గ్రామస్తు లకు అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో-68 నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాల లో గాని, పనిచేయుచున్న స్థలంలో గాని, వ్యాపార లావాదేవీల విషయంలో, రవాణా సందర్భంలో నియమాల ను పాటించాలని తెలిపారు. జీవో-69 నిబంధనల ప్రకారం సభలు, సమావేశలు, ఊరేగింపులు, విందులు చేయరాద న్నారు. ఉగాది, శ్రీరామనవమి, మహావీర జయంతి, రంజాన్ పండుగలకు అనుమతి లేదన్నారు. ఈ నెల 30వరకు అంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. అత్య వసర పరిస్థితులు ఉంటే డయల్ 100కు ఫిర్యాదు చేయా లన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.