Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ఎంపీపీ జాటొత్ నర్మదాలచ్చిరాంను సన్మానించినట్టు ఆ పార్టీ మండలాధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, బహదూర్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీపీ నర్మద లచ్చిరాం టీఆర్ఎస్లో చేరడం సంతోషకరమైన విషయమన్నారు.కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలు భరించ లేక టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండలాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటొత్ నర్మదాలచ్చిరాం, పీఎసీఎస్ చైర్మెన్ , వైస్ చైర్మెన్ బుస్సు పుల్లా రెడ్డి, బొద్రమొని యాదయ్య, నాయకులు అని రెడ్డి, శ్రీలక్ష్మి సృజన్ రెడ్డి, ఎర్పుల చంద్రయ్య, చిందం రఘుపతి, మార సురేశ్, సర్పంచ్లు బొడ్డు నాగరాజు, అని రెడ్డి జగన్ రెడ్డి,పల్లాటి బాల్రాజ్,కుకుడాల శ్రీనివాస్ రెడ్డి, మెగావత్ రాజు నాయక్, ఎంపీటీసీలు, కావలి శ్రీనివాస్, నర్సింగ్ అనిత వెంకటేశ్ గౌడ్, పెసరి గాయాల సుకన్య శేఖర్ రెడ్డి ,నాయకులు జంబుల కిషన్ రెడ్డి,డండెటికార్ రవి, మొద్దు సికిందర్ రెడ్డి, వన పర్తి బద్రినాథ్ గుప్తా, ఎండీ జానీ పాషా, నూతన గంటి శేఖర్, కసరమొని మహేందర్,ఆవుల ప్రశాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.