Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రోగులను పట్టించుకోని వైనం' నవతెలంగాణ కథనానికి స్పందించిన డిప్యూటీ డీఎంహెచ్వో పల్లవి
నవతెలంగాణ-యాచారం
యాచారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది వ్యవహరించిన నిర్లక్ష్య తీరును ' నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం రోగులను పట్టించుకోని వైనం' అనే శీర్షికకు జిల్లా జిల్లా వైద్య యంత్రాంగం స్పందించింది. సోమవారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో పల్లవి పరిశీలించారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్, వైద్య సిబ్బందిపై ఆమె విచారణ చేశారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. కుక్క కాటు వైద్యం కోసం వచ్చిన రోగుల పట్ల స్పందించకుండా, టీ టీ ఇంజక్షన్లు లేవని, మీరు బయట కొనుక్కోమని చెప్పిన వైద్య సిబ్బంది తీరుపై డిప్యూటీ డీఎంహెచ్వో పల్లవి రంగారెడ్డి కలెక్టర్కు నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చిన రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.
ఆస్పత్రి వైద్య సిబ్బంది పనితీరుపై రోగుల అసంతృప్తి :
యాచారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్య సిబ్బంది పనితీరు బాగాలేదని ప్రజా ప్రతినిధులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే రోగులను పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. అక్కడున్న వైద్య సిబ్బంది ఏ రోగానికి ఏయే మందులు ఇవ్వాలో అవ గాహన లేకుండా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది పనితీరు పై ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం తెలుసు కున్న బీజేపీ నాయకుడు నాగరాజు సోమవారం ఆస్పత్రిని సందర్శించి పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నాగరాజు హెచ్చరించారు.