Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ పరిరక్షణకు జీవవైవిద్యం
- కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీపీ యేగేశ్వర్
నవతెలంగాణ-శంకర్పల్లి
పర్యావరణ పరిరక్షణకు ప్రగతి సుధామా ఓ జీవవైవిద్యం లాంటిదని కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామ సమీపంలో ఉన్న ప్రగతి సుధామాలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి సుధామాలో పర్యావరణ పరి రక్షణ జీవవైవిద్యానికి చేపడుతున్న చర్యలను కొనియాడారు. ప్రగతి చైర్మెన్ జీబీకే రావు తొండలు కూడా గుడ్డు పెట్టని బీడు భూమిని 45 లక్షల చెట్లు ,వందలాది ఔషధ మొక్కలు పెంచి, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ ప్రదేశాని చూస్తే, మళ్లీమళ్లీ రావాలనిపిస్తుందని తెలిపారు. పేరుకు తగ్గట్టుగా ప్రగతి సుధామ స్వర్గధామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఉమేష్ జాదవ్ ,ప్రగతి చైర్మన్ జి బి కే రావు, తదితరులు ఉన్నారు.