Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఉప్పరిగూడకు చెందిన దండె పొన్నమ్మ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సందర్భంగా వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి నుంచి రూ.17వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల రూపాయలు పెట్టి వైద్యం చేయించుకోలేని అభాగ్యులకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు, ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తి వెంకట రమణారెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు రమేష్, కోఆప్షన్ సభ్యులు సురేందర్‌రెడ్డి, గోపాల్, టీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి నర్సింహగౌడ్, బొడుసు వెంకటేష్‌యాదవ్, బోసుపల్లి చంద్రశేఖర్, రాజు, శ్రీనివాస్, ఓరుగంటి శ్రీనివాస్, నర్సింహ, భాస్కర్, హరికృష్ణ, రవి, రవితేజ పాల్గొన్నారు.