Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ దేవంబోట్ల రాజు
నవతెలంగాణ-దోమ
కరోనా వైరస్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ దేవంబోట్ల రాజు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిబంధనలు తప్పకుండా పాటిం చాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. ఈ నెల 30 వరకు అంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సంగయ్య, పోలీస్ సిబ్బంది నిరంజన్‌రెడ్డి, పెంటయ్య, సత్యమ్మ, ఆర్ఐ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.