Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వైద్యాధికారి మునీబ్
నవతెలంగాణ-దోమ
దోమ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ మునిబ్ తెలిపారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ తేలిందన్నారు. దోమ గ్రామానికి చెందిన ముగ్గురికి, ఐనపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, పరిగికి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మండలంలో కరోనా చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. 45ఏండ్లు పైబడిన వారు తప్పకుండా కరోనా టీకా తీసుకోవాలని సూచించారు.