Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు రూరల్
ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అక్రమంగా రవాణా చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్ఐ ఏడుకొండలు హెచ్చరిం చారు. మంగళవారం కర్నాటక నుంచి టాండన్ తాండూ రుకు బొలోరో వాహనంలో గుట్కాలను తరలిస్తున్నట్టు న మ్మదగిన సమాచారం మేరకు తాండూరు మండలం బెల్క టూర్ గ్రామ శివారులో రైల్వే ట్రాక్ వద్ద కరణ్ కోట ఎస్ఐ ఏడుకొండలు తోపాటు సిబ్బందిని తీసుకుని తనిఖీలు నిర్వ హించారు. బోలోరా వాహనంలో తరలిస్తున్న గుట్కా ప్యాకె ట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిని విలేకరుల సమావేశంలో సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్ఐ ఏడుకొండలు మాట్లాడుతూ తాండూ రు పట్టణానికి చెందిన కె. నందకుమార్, ఎండీ ఇర్ఫాన్, శివ సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు కర్నాకట నుంచి తాండూరు కు గుట్కాలు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.తనిఖీల్లో భాగంగా వారిని పట్టుకున్నామని తెలిపారు. వారిని విచారించగా నిజం ఒప్పుకున్నారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. నిషేధిత గుట్కాలు అమ్మినా, సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.