Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోయేష్కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
కరోనా వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ, కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై కలెక్టర్లతో మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ వీడియో కా న్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కరోనా నియంత్రణ చర్యలను పటిష్టం గా చేపట్టాలని ఆదేశించారు. రోజువారీ కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం 100, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 150, సివిల్ ఆస్ప త్రిలో 300 పరీక్షలు ప్రతి రోజూ నిర్వహించాలని, వాటి ఫలి తాలను కోవిడ్ యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. కరోనా పరీక్షల ఫలితాల ఆధారంగా కోవిడ్ వ్యాప్తిస్తున్న వారిని గుర్తించి వారిని హౌం క్వారంటైన్ చేయాలని, ఇండ్లలో వసతి లేనివారి కోసం ప్రభుత్వ క్వారంటైన్ హౌంలకు తరలించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. 45ఏండ్లు పైబడిని వారికి టీకా వేయాలన్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో 125 మందికి, సీహెచ్సీ పరిధిలో 250 మందికి, సివిల్ ఆస్పత్రి పరిధిలో 300 మందికి ప్రతి రోజూ కరోనా వ్యాక్సినేషన్ అందించాలని సీఎస్ అన్నారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి ఇవ్వరాదని, ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పౌసుమీ బసు మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఎంఅండ్హెచ్ఓ సుధాకర్ షిండే, డీఆర్డీఓ పీడీ కృష్ణన్, డీపీవో రిజ్వానా, అరవింద్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.