Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కిసాన్ ఏక్తా మోర్చా చెప్పటిన మట్టి సత్యాగ్రహనికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సేకరించిన మట్టిని ఢిల్లీలో నాలుగు ప్రదేశాలలో ప్రదర్శించడం జరిగిందనీ స్వరాజ్య వే దిక రాష్ట్ర సభ్యులు ఎస్.ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్టం వికారాబాద్ జిల్లా దోమ మండలం, దాదాపూర్ గ్రామం నుంచి రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర సభ్యులు ఈశ్వర్ ఢిల్లీలోని గజ్వార్ బార్డర్లో ప్రా రంభించిన మిట్టి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలోని ఐదు గ్రామాల్లో రైతుల నుంచి మట్టి సత్యగ్రహానికి మద్దతుగా సేకరించిన మట్టి కుండాలను ఆ ఉద్యమంలో పాల్గొని ప్రదర్శించారు. మూడు నూతన వ్యవ సాయ చట్టాలు, విద్యుత్ చట్టలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్లు కిరణ్, విస్సా, శంకర్, కొండల్, సాగారిక తదితరులు పాల్గొన్నారు.