Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ మంద జ్యోతి పాండు
నవతెలంగాణ-కందుకూరు
మండలంలో సమర్థవంతంగా అభివృద్ధి పనులు చేయడానికి బ్లాక్ పంచాయతీ కమిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీపీ మంద జ్యోతి పాండు అన్నారు. మంగళవారం కందుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు ఆధ్వర్యంలో బ్లాక్ పంచాయతీ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో అన్ని శాఖలు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. కమిటీ సభ్యులందరూ భాగ స్వాములై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. అనంతరం కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ బ్లాక్ పంచాయతీ కమిటీ చైర్మెన్‌గా ఎంపీపీ మందా జ్యోతి పాండు, వైస్ చైర్మెన్‌గా గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, కమిటీ సభ్యులుగా లేమూరు సర్పంచ్ పరంజ్యోతి, కొత్తగూడ సర్పంచ్ సాదా మల్లారెడ్డి, జైతారం సర్పంచ్ సదాలక్ష్మి, కొత్తూరు సర్పంచ్ వసంత కృష్ణగౌడ్, పెద్దమ్మ తండా సర్పంచ్ సుమన్ , జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీ డీవో కృష్ణకుమారి, ఎఫ్ఆర్ఓ నాగరాజు, ఏపీఎం కవిత, మండల వ్యవసాయ అధికారి శైలజ వరలక్ష్మి సురేందర్ రెడ్డి, ఏపీఎం రవీందర్ రెడ్డి, వెంకన్న, విజయలక్ష్మిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.