Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
గుంట లెక్కన భూముల రిజిస్ట్రేషన్ చేయడం వెంటనే నిలిపి వేయాలని ఎంపీపీ మంద జ్యోతి పాండు, ఎంపీటీసీలు మంగళ వారం కందుకూరు తహసీల్దార్ జ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ఎలాంటి సంబంధం లేకుండా వ్యవసాయ భూములకు ఎలాంటి అనుమతులు లేకుండా గుంటలుగా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, భూములు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయం కూడా లేదన్నారు. వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ భూములలో రోడ్లు ఏర్పాటు చేసి గుంటల లెక్కన భూమి అమ్ముతున్నారని చెప్పారు. 50 ఎకరాలు, 100 ఎకరాలు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు గుంటలుగా చేసి, విక్రయిస్తున్నారని తహసీల్దార్‌కు వెల్లడించారు. తహసీల్దార్ జ్యోతి మాట్లాడుతూ గ్రామాల్లో ఆయా భూమలును పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సురసాని రాజశేఖర్ రెడ్డి, సురసాని ఎల్లారెడ్డి, జి సురేష్, బక్క మల్లేష్, సురమెని లలిత కుమార్ పాల్గొన్నారు.