Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు నమ్మకం కల్పించే విధంగా విధులు నిర్వహించాలని ఎంపీపీ గొప్పు సుకన్య భాష అన్నారు. మంగళవారం యాచారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, హాస్పిటల్లో జరుగుతున్న అవకతవకలపై ఎంపీపీ ఆరా తీశారు. అనంతరం ఎంపీపీ కొప్పు సుకన్య భాష మాట్లాడుతూ ప్రభు త్వాలు పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తే, అందులో పని చేస్తున్న వైద్య సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఏఎన్ఎంలతో సమావేశమై, ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, బీజేపీ మండలాధ్యక్షులు తాండ్ర రవీందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.