Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశువైద్యాధికారి చంద్రశేఖర్రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
పాడి రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు చేపట్టిందని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం రాయితీపై రైతులకు గడ్డికత్తిరింపు యంత్రాలు (చాప్కట్టర్స్)ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడీ రైతులకు మేత వృథాకాకుండా ఉండేందుకు గడ్డికత్తిరింపు యంత్రాలు వినియోగించుకోవాలన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చాప్కట్టర్స్ (గడ్డికత్తిరింపు యంత్రాలు) రాయితీపై అందిస్తుందని తెలిపారు. చాప్కట్టర్కు రూ.25800 ఉండగా రాయితీ రూ.10వేలు, రైతు వాటా రూ.15,800 కట్టాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ముగ్గురు రైతులకు చాప్కట్టర్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, పశువైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.