Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి
- కోట్‌పల్లి మండలంలో జడ్పీ నిధులతో 1కోటి 80లక్షలతో నిర్మిస్తున్న పనులు ప్రారంభం
నవతెలంగాణ-కోట్‌పల్లి
గ్రామల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతమహేందర్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం 1 కోటి 80లక్షల జడ్పీ నిధుల సహాయంతో కోట్‌పల్లి మండల పరిధిలోని బీరోల్, నాగసన్ పల్లి, మోత్కుపల్లి, బార్వాద్, కరింపుర్, జిన్నారం, కంకణాలపల్లి, ఎన్నారం, కొత్తపల్లి, కోటపల్లి, బుగ్గపూర్, అన్నసాగర్, ఇందోల్ గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టినా పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి తార తమ్యాలు లేకుండా, వర్గపోరుకు పోకుండా గ్రామ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు ఉండాలన్నారు. రూ. 1కోటి 80లక్షలే కాకుండా మరికొన్ని పనులను సర్పంచులు అందబాటులో లేకపోవడంతో ప్రారంభించలేకపోయినట్టు తెలిపారు. గ్రామ అవసరాలను గుర్తిస్తూ అభివృద్ధి నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో రైతులకు ఎంతో మేలు చేసారని అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లా ఉమాదేవి, పార్టీ అధ్యక్షులు అనిల్, సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, పిఏసిఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, రైతుబంధు సంఘం మండలాధ్యక్షులు సత్యం (సాయన్న) ఆయా గ్రామల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.