Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ కంపెనీలోని యంత్రంలో పడి కుడి చేయిని కోల్పోయిన భవితకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భవితను ఆయన పరామర్శించారు. అనంతరం భవిత భర్తను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రుద్ర కుమార్ మాట్లాడుతూ కాటేదాన్‌లోని రామస్వామి గట్టి ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన భవిత ఈ నెల 5న ప్రమాదవశాత్తు యంత్రంలో పడింది. దీంతో నాలుగు వేళ్లతో మోచేయి వరకు చేయి తెగిపోయింది. అప్పుడు యజమాని కేవలం రూ.రెండు వేల రూపాయలు ఇచ్చి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా యజమాని కుటుంబ సభ్యులను బెదిరించడం మొదలు పెట్టాడని తెలిపారు. వెంటనే భవిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాల న్నారు. కంపెనీలో పనిచేసే కార్మికులకు కనీసం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కూడా లేవని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి పరిశ్రమల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవితకు న్యాయం చేసే వరకు అండగా ఉంటామని భరోసా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాటేదాన్ క్లస్టర్ కో-కన్వీనర్ రాజు, కోశాధికారి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.