Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాధికారి రేణుక దేవి
నవతెలంగాణ-మర్పల్లి
మైక్రాన్ సాఫ్ట్ వేర్ కంపెనీ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివద్ధి చేయడంలో వారి కృషి అభినందనీయమని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుక దేవి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ ప్రతినిధులు భాను ప్రకాష్, ప్రవీణ్ కుమార్లకు జిల్లా విద్యాధికారి రేణుక దేవి, మండల విద్యాధికారి విద్యాసాగర్ పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను మైక్రాన్ కంపెనీ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారు మూడేండ్లు దత్తత తీసుకొని సుమారు రెండు కోట్ల రూపాయలతో పాఠశాలల మరమ్మతులతోపాటు కాంపౌండ్ వాల్, మూత్రశాలలు, ఫ్లోరింగ్, పెయింటింగ్ వంటి పనులు చేపట్టి సుందరీకరించడం అభినందనీయమన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ వంటి సౌకర్యాలు కల్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు కంపెనీ యాజమాన్యానికి సూచించారు. ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాఠశాలను కాపాడుకుంటేనే మిగతా పనులు చేసేందుకు ఉత్సాహం కలుగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఖలీమోద్దీన్, ఉపసర్పంచ్ రాజు, వసంత్ కుమార్, విద్యా కమిటీ చైర్మన్ మనోహర్, ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు ఉపాధ్యాయులు వెంకటయ్య, శ్రీశైలం, సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.