Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
కాలేజీకి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తారానగర్లో ఉండే రవికుమార్ మేనకోడలు వైష్ణవి (16) గంగారాం సుమన్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నది. ఈ నెల 5న కాలేజీకి వెళ్లి స్కాలర్ షిప్ అప్లై చేసి వస్తానని ఉదయం 8:00 లకు ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కాలేజీకి వెళ్లి ఆరా తీయగా తను కాలేజీకి రాలేదని చెప్పారు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.