Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీపీలు విశ్వప్రసాద్, కుశల్కర్
నవతెలంగాణ-ఫరూఖ్‌నగర్
వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఏసీపీలు విశ్వప్రసాద్, కుశల్కర్లు అన్నారు. షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ ఎస్సై ఆధ్వర్యంలో 'హెల్మెట్ ఛాలెంజ్' కార్యక్రమాన్ని ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, షాద్‌నగర్ ఏసీపీ కుశల్కర్లు పాల్గొని హెల్మెట్ ఛాలెంజ్ కార్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ మనిషికి ప్రాణం ఎంతో ముఖ్యమైందన్నారు. వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలన్నారు. వాహనదారుల్లో క్రమశిక్షణ కల్పించేందుకే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారని తెలిపారు. ఏసీపీ కుశల్కర్, షాద్ నగర్ మున్సీపల్ చైర్మన్ నరేందర్,చేవెళ్ల ఏసీపీ కి హెల్మెట్ ఛాలెంజ్ విసిరారు. అనంతరం ట్రాఫిక్ ఎస్సై రఘు మాట్లాడుతూ షాద్‌నగర్ పరిధిలో ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలపై అనేక రకాలుగా అవగాహన కల్పించామన్నారు. సైబరాబాద్ పరిధిలో ఎక్కువ ప్రమాదాలు వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం మూలంగానే సంభవిస్తున్నాయని, ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వాహనదారులు ఈ ప్రమాదాలను గమనించి హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్, బొల్లారం సీఐ ప్రశాంత్, మియపూర్ ట్రాఫిక్ సీఐ సుమన్, అల్వాల్ సీఐ రాజశేఖర్ రెడ్డికి హెల్మెట్ ఛాలెంజ్‌ను విసిరారు. వీళ్ళు కూడా మరో ముగ్గురికి హెల్మెట్ ఛాలెంజ్ విసిరి వాహనదారులు కచ్చితంగా హెల్మెట్‌ను ధరించేలా చేయాలని కోరారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్ చేతుల మీదుగా సేవియర్స్కు మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ సత్యనారాయణ, చౌదరిగూడ ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.