Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ మహిపాల్
నవతెలంగాణ-పరిగి
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 12న నిర్వహించనున్న నీలి దండు కవాతును జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ మహిపాల్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ రిజర్వేషన్లు, ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం నిర్వహించనున్న నీలిదండు కవాతు పోస్టర్ను బుధవారం పరిగి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర సందర్భంగా 12న వికారాబాద్లోపెద్ద ఎత్తున నీలి దండు కవాతు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న అంబేద్కర్ పూలే వారసులంతా కవాతులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం రవీందర్, డీహెచ్ పీఎస్ జిల్లా కార్యదర్శి ఎం వెంకటేష్, మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి మోహనాచారి, డీహెచ్ పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు బీ మల్లేష్, కేవీపీఎస్ నాయకులు అనంతరాములు పాల్గొన్నారు.