Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కూచిపూడి నత్యంలో అద్భుత ప్రతిభ కనబరిచిన రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన తన్మయికి ఉగాది ప్రతిభాపురస్కారం దక్కింది. నవ వసంతం కూచిపూడి కళానిలయం ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నాట్య గురువులు పసుమర్తి శేషుబాబు చేతుల మీదుగా తన్మయి బుధవారం ఉగాది ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నాట్య గురువులు పసుమర్తి శేషు బాబు మాట్లాడుతూ చిన్నతనం నుంచి నాట్యంలో తన్మయి అద్భుత ప్రతిభ కనబరుస్తోందన్నారు. భవిష్యత్తులో మరింత నత్య ప్రదర్శన ఇవ్వాలని ఆకాంక్షించారు. తన్మయిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు రాకేష్, దివ్యశ్రీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవాజ్ఞశర్మ, ప్రముఖ న్యాయవాది ఎం వెంకటేశ్వరి, సంఘ సేవకులు వసంత రాములు, తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి ఎస్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు.