Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీ సెక్రెటరీ సుధారాణి
నవతెలంగాణ-పెద్దేముల్
పెద్దేముల్ గ్రామపంచాయతీ 4.5 ఉన్న 2 సెటర్ల్, త్తైబజార్ వేలం ప్రకటన వేయనున్నట్టు పెద్దేముల్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ సుధారాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం పెద్దేముల్ గ్రామ పంచాయతీ ఆవరణలో వేలం ప్రకటనకు సర్పంచ్ ద్యావరి విజయమ్మ అధ్యక్షతన వహిస్తారని తెలిపారు.ఈ వేలంలో పాల్గొనే అభ్యర్థులు గురువారం ఉదయం 8.30 నుంచి 10.30 నిమిషాలలో డిపాజిట్ చెల్లించి రసీదు పొందాలని పేర్కొన్నారు. దుకాణం వేలం అభ్యర్థులు రూ.15 వేలు డిపాజిట్ చెల్లించాలనీ, త్తై బజార్ అభ్యర్థులు రూ.20 వేలు చెల్లించాలని తెలిపారు. వేలంపాటలో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా గ్రామపంచాయతీలో ఇంటి పన్ను, నల్లా పన్ను వంటి తదితర బకాయిలు ఉండరాదని పేర్కొన్నారు. వేలం పాటలో దక్కించుకున్న అభ్యర్థులు అదే రోజు మొత్తం డిపాజిట్ చెల్లించి రసీదు తీసుకోవాలని తెలిపారు. దుకాణాల నెలసరి అద్దె రూ.1700 లు చెల్లించాలని సూచించారు.10.30 దుకాణాల వేలం ప్రకటన 11.30 త్తై బజార్ వేలం ప్రకటన ఉంటుందని తెలిపారు.