Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
తాగిన మైకంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పత్తేపురం రైల్వే గేటు సమీపంలో బుధవారం జరిగింది. శంకర్పల్లి ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీకి చెందిన కాల్వ మీది దర్శన్( 45) వృత్తి రీత్యా కూలి పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కాగా కూలి పని చేసుకుని వచ్చిన డబ్బులతో ప్రతి రోజూ తాగేవాడు.ఈ నెల 5వ తేదీన ఉదయం కూలి పనికి వెళ్లి సాయంత్రం వరకూ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా అతని ఆచూకి లభించలేదు. పత్తేపురం రైల్వే గేట్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాని పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని అన్న కొడుకు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.