Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథ యూనియన్ రాష్ట్ర నాయకుడు జగన్
నవతెలంగాణ-చేవెళ్ల
మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని మిషన్ భగీరథ కార్మికుల యూనియన్ రాష్ట్ర నాయకులు జగన్ అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ 8 గంటల పనిదినాలను, వారానికి ఒక రోజు సెలవు దినం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.