Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
వేసవిలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మె ల్యే పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రెండు మూడు, నెలలో వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో నియోజకవర్గంలో తాగు నీటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లకు చూసించారు.కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ లీకేజీతో నీరు కలుషితమయ్యే ప్రమాదముందనీ, వెంటనే పైప్లైన్ల మరమ్మతులు చేపట్టాలని హెచ్చరించారు. గ్రామలలో ఇప్పటికే పెండింగులో ఉన్న పనులు 70 శాతం మాత్రమే పనులు పూర్తి చేసినట్టు వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఎమ్మె ల్యే స్పందించి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టల్ లకు పాఠశాలలకు, నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. గతంలోనే రూ.3 కోట్ల మెటిరియల్ అవసరమని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆ మెటిరియల్‌ను విడుదల చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ, ఇంజినీర్లు చంద్రమౌళి, అంజనేయులు , పద్మలత ,శంకర్, టీఆర్ఎస్ నాయకులు మడిగా శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, శ్రావణ్ గౌడ్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.