Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిఫ్ ఇండియా స్వేరో అనుబంధ సంస్ధల ఆధ్వర్యంలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మండల కేంద్రంలోని అంజనా దేవి ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం గొప్ప పరిణామన్నారు.స్వేరో కమిటీ సభ్యులు మాట్లాడుతూ వెయ్యి యూనిట్ల రక్తం సేకరణ లక్ష్యంతో స్వేరోస్ అన్ని జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. స్వేరోస్, ప్రవీణ్ కుమార్ అభిమానుల స్వచ్ఛందంగా అనేక మంది ముందుకు వచ్చి, రక్తదానం చేసిన వారందరికి అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో స్వేరో కమిటీ సభ్యులు, స్వేరో అభిమానులు పాల్గొన్నారు.