Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే దంపతులు
- అభిమానుల సందడితో మారుమోగిన క్యాంపు కార్యాలయం
- ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన అభినందనలు
- భారీ గజమాలతో సత్కారం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌కు ప్రధాన అనుచరుడిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాజకీయ వారసుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటీ) పుట్టినరోజుకు అభిమానులు తరలివచ్చారు. కేక్‌కట్ చేయించుకుని సంబురాలు జరుపుకున్నారు. భారీ గజమాలలో సత్కరించారు. పుట్టిన రోజు అభినందనలు తెలిపేందుకు పోటీ పడ్డారు. ముందుగా ఆయన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తన తల్లిదమండ్రులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దంపతులు కేక్ కట్‌చేసి పుట్టిన రోజు వేడుకులను ప్రారంభించారు. అభిమానుల సందడితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మారుమోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభినందనల వెల్లువలు కొనసాగాయి. బంటీయూత్ఫోర్స్ ఆధ్వర్యంలో విడతల వారీగా భారీ గజమాలతో సత్కారించారు. బాణాసంచాలతో సంబురాలు జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. అతి చిన్న వయస్సులో రాజకీయ ఆరంగేట్రం చేసిన
బంటీ విద్యార్థి దశలో మంచి క్రికెట్ క్రీడాకారులుగా, ఐఎస్ సదన్ కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహించారు. అనంతరం టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రాజకీయ వారసుడిగా దూపుకుపోతున్నారు. ఎంకేఆర్ ఫౌండేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిరుపేద విద్యార్థులు, యువతకి ఉద్యోగ కల్పన లక్ష్యంగా శిక్షణ ఇచ్చి వారి కుటుంబాలలో వెలుగు నింపుతున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలకు నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చారు.