Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియపూర్
మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో మంజీర పైప్ లైన్ పగిలిపోవడంతో రోడ్డుపై మంజీర నీరు ఏరులైపారుతోంది. అటుగా వెళ్తున్న మియపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గమనించి జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పౖౖెపు పగిలిపోయి రోడ్డుపై మంజీర నీరు వృథా అవుతోందని, కొత్త పైప్ లైన్ వేయాలని సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.