Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మూతపడటం తో జీతాలు అందక అవస్థలు పడుతున్న ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు నెలకు 2 వేలు 25 కిలోల బియ్యం ఇసా ్తమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశానుసారం సోమవారం మండల వి ద్యాధికారి విద్యాసాగర్ ఆధ్వర్యంలో మం డలంలో 3 టీములుగా ఏర్పడి 8 ప్రయి వేటు పాఠశాలల వివరాలకు గాను ఆరు పాఠశాలల ఫిజికల్ వెరిఫికేషన్ చేసినట్టు మండల విద్యాధికారి విద్యాసాగర్ తెలిపారు. ఆరు పాఠశాలల్లో 44 మంది ఉపాధ్యాయులు, 14 మంది బోధనేతర సిబ్బంది ఉన్నట్టు ఆయన తెలిపారు,. రెండు పాఠశాలల వివరాలు అందాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో విద్యాసాగర్, ప్రధానోపాధ్యాయులు లాలయ్య, అలీ మోదిన్, సీఆర్పీ మల్లేశం, వెంకట్రావు, రాజారావు, సీఆర్పీ మహబూబ్ అలీ, సంధ్య, ఉమారాణి, సీఆర్పీ యాదయ్య పాల్గొన్నారు.