Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శేరిలింగంపల్లి
చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సామాజిక సేవ రత్న అవార్డు గ్రహీత భేరి రామచందర్ యాదవ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో కాలనీలో చెత్త చెదారం పేరుకుపోయి ఓపెన్ ప్లాస్టిక్, వ్యర్ధపదార్ధాలు, ప్లాస్టిక్ కవర్ల వల్ల మూటలు కట్టి కొంతమంది ఓపెన్ నాళాలో వేస్తున్నారు. వారికి సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది మహేష్, లక్ష్మణ్, వెంకటేష్, గణేష్, రాజేష్, రాము, శివ, పంతం వెంకటేష్, బసవయ్య పాల్గొన్నారు.