Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డిమాండ్ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ బస్ స్టేషన్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మే రకు ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా ఆనంద్ కే, వై ప్రణరు, ఉదరు సోమవారం శంషాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బస్ స్టేషన్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ శంషాబాద్ బస్ స్టేషన్ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులకు, మున్సిపల్ అధికారుల కు ఉందా లేదా అని ప్రశ్నించారు. బస్ స్టేషన్ మొత్తం వ్యాపార మ యం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉచిత మూ త్రశాలలను తొలగించి కొత్త వాటిని అందుబాటులోకి తేలేకపోవ డంలో మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ మున్సిపల్ అధికారులు ప్రయివేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారా చెప్పాలన్నారు. 6 నెలల క్రితం బస్ స్టేషన్ నుంచి డ్రయనేజీ పైపులైను కోసం ఉచిత టాయిలెట్లను తొలగించారన్నారు. నాలుగు నెలల క్రితం బస్ స్టేషన్ ప్రాంగణంలో 5 లక్షల 70 వేల రూపా యలతో ఉచిత మరుగుదొడ్లు నిర్మించి వాటిని రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభం చేసినప్పటికీ నేటికీ అందుబాటులోకి రాలేదన్నారు. ఉచిత మరుగుదొడ్లను ఓపెన్ చేసి డబ్బులు కాజేయడానికి అధికారులు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారనే అనుమానం కలుగుతుందని అన్నారు. శంషాబాద్ బస్ స్టేషన్లో ప్రయాణికుల గోడు పట్టించుకోకుండా ఆవరణం అంతా కమర్షియల్‌గా మార్చి ప్రజలను పీడిస్తున్నరన్నా రు. ఉచిత మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల మ హిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. పార్కింగ్ సౌకర్యం లేక ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు వేసే చాలన్ తట్టుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ స్టేషన్ సమస్యలు పరిష్కరించాలని అనేక సా ర్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిం చారు. మున్సిపల్ అధికారులు ఆర్టీసీ అధికారులు కుమ్మక్కై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. శంషాబాద్‌లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు గొప్పలు చెప్పుకుంటున్న వారు చేస్తున్న అభివృద్ధి ఏపాటిదో బస్ స్టేషన్ చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా బస్‌స్టేషన్ ఆవరణలో తాగునీరు, మూత్రశాలలు, పార్కింగ్ సౌకర్యం కల్పిం చాలని.. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.