Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మర్పల్లి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవా లను పురస్కరించుకుని 130 చిత్రాలతో ఎగ్జిబిషన్‌ను సోమ వారం సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య, ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉప సర్పంచ్ అంజిరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ బాల్యం నుంచి విద్య, వివాహం, బయట దేశాల్లో చదివిన సందర్భం, భారత రాజ్యాంగం, న్యాయశాఖ మంత్రిగా, అనేక ఉద్యమాలు సందర్భం, చివరకు భారతరత్న, అనేక సమా వేశాలు పాల్గొన్న సందర్భంలో చేసినటువంటి చిత్రాలను ఫోటో ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచినట్టు వారు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల యువజన సంఘాలు ఈ చిత్ర ప్రదర్శనను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం యువతపై ఉందన్నారు. మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుపతి రెడ్డి, నర్సింలు, చిన్నోడు, శ్రీశైలంగౌడ్, జైహింద్‌రెడ్డి, రాహుల్ రవి, వార్డు మెంబర్లు హనుమంతరావు, ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి, రమేష్ గౌడ్, బలరాం గౌడ్, రాజు రవి, అనంతరం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.