Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ సర్కిల్ జీహె చ్ఎంసీ పరిధిలో పారిశుధ్య విభాగం లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. అత్తాపూర్ డివిజన్ పారి శుధ్య విభాగంలో కాంట్రాక్టు కార్మికు డిగా పనిచేస్తున్న మైలారం రమేష్ (56) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. అదేవిధంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో కార్మికురాలుగా పనిచేస్తున్న పెంటమ్మ(55) అనారోగ్యంతో మృతి చెందింది. ఒకేరోజు ఇద్దరు పారిశుధ్య కార్మికులు చనిపోవడంతో తోటి కార్మికులు షాక్‌కు గురయ్యారు. కార్మికుల మరణవార్త తెలుసుకున్న ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనం పల్లి జైపాల్‌రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి ఆనంద్ మృతదేహాల ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కు టుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాన సం స్కారా లు ఖర్చుల ని మిత్తం రెండు కుటుంబాలకు పది వేల రూపాయల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజే శారు. ఈ సంద ర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ అనా రోగ్యంతో ఒకేరోజు ఇద్దరు కార్మికులను కోల్పోవడం బాధాకరమని అన్నారు. వీరి కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు. ఎండలు పెరగడంతో కార్మికులు అనారోగ్యం బారిన పడు తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు అనా రోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.