Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ కలెక్టర్ పౌసుమీ బసు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలో భూ సమస్యలకు సంబంధించిన 2,581 పెండింగ్ కేసులను తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పౌసుమీ బసు అధికారులను ఆదేశించారు. సోమవారం జి ల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహ సీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి భూ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్లో భూ సమస్యలకు సంబంధించిన ఆధార్ అనుసంధానం, క్యాస్ట్, జెండర్, నేమ్ కరెక్షన్, ఫోటో మిస్ మ్యాచింగ్, సర్వే నెంబర్ మిస్సింగ్ లాంటి సాధారణ సమస్యలకు సంబంధించి తహ సీల్దార్లు వెంటనే పరిష్కరించాలన్నారు. ఇట్టి పనులను వేగ వంతం చేసేందుకు గాను అన్ని మండలాల తహసీల్దార్, నా యబ్ తహసీల్దార్లు ప్రతి రోజూ సాయంత్రం 5:00 గంటల కు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెండింగ్ పనులను పూర్తి చేయాలనీ ఆదేశించారు. జిల్లాలో 50 శాంతం కేసులు ఆధా ర్ అనుసంధానం, డిజిటల్ సంతకాలవేనని తెలిపారు. వీట ిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. స్లాట్ బుకింగ్ అ యిన వాటిని ఎప్పటికప్పుడు వెంట వెంటనే పరిష్కరిం చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీఓలు, తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు శ్రీధర్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.