Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు మల్కయ్య, మహిపాల్
- వికారాబాద్ పట్టణంలో నీలిదండు కవాతు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్కయ్య, మహిపాల్ అన్నారు. ఈ నెల 12 నుంచి 30 వరకు ఫూలే-అంబేద్కర్ యాత్రను సోమవారం వికారాబాద్ పట్టణంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కొత్త గాడి అంబేద్కర్ విగ్రహం నుండి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నీలి దండు కవాతు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ దేశంలో మను ధర్మ శాస్త్రానికి రాజ్యాంగానికి మ ధ్యలో వారధి సాగుతుందన్నారు. బీజేపీ నాయకులు రాజ్యాం గాన్ని, ఉన్న చట్టాలను రిజర్వేషన్లను, ప్రభుత్వ కార్యాల యాలను తొలగించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో దళిత, మైనార్టీలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఫూలే, అంబేద్కర్ వాదులు అంతా ఏకం కావాలన్నారు. ఈ నెల 30 వరకు జరిగే అంబేద్కర్ ఫూలే సందేశ్యాత్రను విజయ వంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లేశం, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రత్నం, చంద్రయ్య మక్తల్ రవి, జోగు లాలయ్య, సుదర్శన్, యాదయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య, అనంత రాములు, అనంతయ్య, ఆనందం, రాజు, శ్రీనివాస్, వెంకటేష్, బాలరాజు, బాలయ్య, కవిత, నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.