Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-శంకర్పల్లి
2021-22 సవరణ చేసుకుంటూ, శంకర్పల్లి మున్సిపల్ లో అభివృద్ధి పనులకు రూ. 12 కోట్ల 36 లక్షలకు ఆమోదం తెలిపినట్టు ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్‌పై చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020-21 సవరణ చేసుకుంటూ 2021-22కు రూ. 12 కోట్ల 36 లక్షలతో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఈ నిధుల ద్వారా శంకర్పల్లి మున్సిపల్ అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ వెంకటరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు చంద్రమౌళి, అశోక్, సంతోష్, శ్రీనాథ్ గౌడ్, రాములు ,గోపాల్, లక్ష్మమ్మ, శ్వేతా పాండురంగారెడ్డి, రాధాబాలకృష్ణ, వై వాణి ప్రకాష్ గుప్తా, సంధ్యారాణి అశోక్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు వెంకట్‌రెడ్డి, మహమూద్, షబానా బేగం, రజిని శ్రీనివాస్, తదితరులున్నారు.