Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
ఉపాధి హామీ కూలీలు పనిచేసే ప్రదేశంలో ఎండ తీవ్రత తట్టుకునేలా టెంటు, తాగునీటి సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ అంజయ్య అన్నారు. సోమవారం కడ్తాల్ మండలం సరికొండ గ్రామంలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో కార్మిక సంఘం పరిశీలించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు దినసరి కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజురోజుకూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయనీ, వాటికి అనుగుణంగా ఉపాధి కూలీలకు రోజువరి కూలీ రూ.600 లు ఇవ్వాలని కోరారు. మెడికల్ కిట్లు, పని ప్రదేశంలో మాస్కులు, శానిటైజర్ సరఫరా చేయాలన్నారు. ఇప్పటివరకు కూలీలకు కొత్తగా గడ్డపారలు, పారలు, తట్టలు ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రస్తుతం దినసరి కూలీలకు కేవలం రోజుకు రూ. 50, 200 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాకు, నరసింహారెడ్డి, నరేష్, శ్రీనివాస్, యాదయ్య, రాజేష్ చారి, నరసింహ , కరుణమ్మ, లింగం, ప్రేమ లత , సంతోష, మహేష్ పాల్గొన్నారు.