Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
మాస్కులు లేకుండా రోడ్లమీద తిరిగితే జరిమానాలు తప్పవని సీఐ లింగయ్య హెచ్చరించారు. ఆదివారం రాత్రి యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి, నానక్ నగర్ పలు గ్రామాల్లో పోలీసులు కరోనా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కులు లేకుండా ఎవరు రోడ్లమీద తిరుగవద్దన్నారు. మాస్కులు లేకుండా రోడ్లపై కనబడినా, రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు. కరోనాను నివారించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు దరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. సెకండ్ వేవ్ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ప్రభాకర్, పద్మ య్య, పోలీస్ సిబ్బంది, నానక్ నగర్ సర్పంచ్ పెద్దయ్య, నంది వనపర్తి టిఆర్ఎస్ నాయకుడు కొండాపురం శ్రీశైలం, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.