Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేరో సర్కిల్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నెపాగ నర్సింగ్‌రావు
నవతెలంగాణ-మొయినాబాద్
నిరుపేదలకు విద్యనందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని స్వేరో నాయకులు అన్నారు. మహాత్మ జ్యోతిరావుఫూలే జయంతి సందర్భంగా సోమవారం స్వేరోస్ నెట్ వర్క్ మొయినాబాద్ మండలిన్చార్జి సత్యం కర్రొల్ల సూచనల మేరకు , స్వేరో గ్రామ నాయకుల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డపూర్ గ్రామంలో స్వేరో సర్కిల్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రెటరీ సత్యం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లింగం, ప్రధాన కార్యదర్శి గన్నెపాగ నర్సింగ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ..గ్రామీణ నిరుపేదలకు ఉచితంగా విద్యనందించి, ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేస్తామన్నారు. ఎంపీటీసీ రవీందర్ రెడ్డి (బాబన్న ), గోపి కృష్ణరెడ్డి గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇష్టంగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. చదువుతోనే ప్రతి సమస్య పరిష్కరించుకోవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో స్వేరో నెట్వర్క్ డివిజన్ ఎస్డీసీ ఇన్చార్జి ప్రవీణ్, ఫిట్ ఇండియా మండలాధ్యక్షులు జంగం యాదగిరి, స్వేరో గ్రామ నాయకులు సురేశ్, కుమార్, జనార్ధన్, కిరణ్, స్వేరో సర్కిల్ అధ్యక్షుడు పవన్ ఫిట్ ఇండియా అధ్యక్షులు గిరిబాబు, శివ, జ్ఞానేశ్వర్, నర్సింహా, తదితరులున్నారు.