Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరురూరల్
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్. అన్నారు సోమవారం తాండూర్ మండల పరిధిలోని ఉద్దండాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పి. కౌసల్య, నర్సిములు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిం చడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దళిత బహుజనుల అభివృద్ధి కోసం అంబేద్కర్ అలోచించి రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన మహౌన్నత వ్యక్తి అన్నారు. అంతేకాకుండా మహిళాల అభివృద్ధి కోసం పాటుపడి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన వ్యక్తి అన్నారు. రాజ్యాంగంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన వ్యక్తి అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పనిచేయడం జరిగిందన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమానత్వం కోసం కృషి చేయాలని, ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారు పిలుపునిచ్చిన విధంగా బోదించు సమీకరించు పోరాడు అనే వినదంతో పని చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేశవరావు, ఉప సర్పంచ్ షబానా ఖలీల్, గుల్లమడుగు తండా సర్పంచ్ దశరథ్, కేవీపీస్ జిల్లా అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బాని బసయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, అశోక్ రాజ్, ఉద్దండాపూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎం.నర్సిములు, కార్యదర్శి ఉషన్, తదితరులు పాల్గొన్నారు.