Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేరో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు
నవతెలంగాణ-మొయినాబాద్
మొయినబాద్ మండలంలోని మారుమూల గ్రామం చిన్న మంగలారం, గన్నేపాగా లక్ష్మయ్య, కములమ్మా దంపతులకు ఆరుగురు సంతానం అందులో నాల్గవ కుమారుడు గన్నేపాగా-స్వేరో నర్సింగ్ రావు అలియాస్ దాస్ 1987జులై 10న స్వగ్రామం చిన్నమంగలారంలో జన్మినించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పూట గడవడం కష్టంగా ఉండేది. కనీసం ఉండేందుకు సరైన ఇల్లు లేదు. తాటాకు గుడిసెలో వర్షం కురిస్తే చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించేవారు. 1992లో బడికి వెళ్లే వయసులో సరైన సదుపాయాలు లేక ఆర్ధిక స్థోమత లేక చదువుకు దూరంగా ఉన్న కుటుంబాలకు (ఏం జీ ఎఫ్) మామిడి వెంకట రంగయ్య ఫౌండేషన్ బాసటగా నిలవడంతో చదువు పట్ల ఆసక్తి కనబర్చేల చేసింది. తనకు పాఠాలు నేర్పే చక్రవర్తి పంతులు చదువులో, ఆటపాటలలో చూరుకుదనాన్ని చూసి ముచ్చట పడేవారు. నర్సింగ్‌రావు భవిష్యత్‌లో ఉన్నత స్థానంలో నిలుస్తావని పదే పదే ప్రశంసించేవారని తెలిపారు. 4వ తరగతి వరకు అక్కడే చదువు సాగింది. అనంతరం 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆర్థిక స్థితి సరిగా లేక ఆటుపోట్లతో చదువు సాగింది. కుటుంబ నేపథ్యంలో ఆదాయం లేక కుటుంబీకులు అందరూ తల్లిదండ్రులపై ఆధారపడటంతో కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని తన కాళ్లపైనతాను నిలబడాలనే ఉద్దేశ్యంతో బిఎస్సి(ఎంఎల్టి) మధ్యలోనే ఆపేసి గాంధీ ఆసుపత్రిలో అప్రెంటిస్‌గా కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశారు. తాను గర్వంగా చెప్పుకునే విషయమేమిటంటే కుటుంబంలో అందరూ విద్యావంతులేనని వైద్య సంబంధిత వత్తిలోనే కొనసాగుతున్నారని పేర్కొన్నారు. 2011మే నెలలో సుమలతతో వివాహం అయింది. తాను నర్సింగ్ రావు తీసుకునే ప్రతి నిర్ణయంలో సపోర్టివ్‌గా ఉంటూ ఎల్ల్లవేళల ప్రోత్సాహం అందిస్తూ వస్తుందన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు నిశిత, నిహాల్. సంసార జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో తన జాతికి ఏదైనా చేయాలనే తపన పదే పదే కలచివేసిందన్నారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయమే రాజకీయం వైపు అడుగులు వేసేలా దోహదం చేసిందన్నారు.
చిన్నప్పటి నుండి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలనే తపన, మంద క్రిష్ణమాదిగ పోరాటాలు తీవ్రంగా ప్రభావితం చేశాయాని, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీపైన అభిమానం కాంగ్రెస్ పార్టీలో చేరేలా అడుగులు వేసేలా చేసింది. 2012 నుండి పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్న 2017లో కాంగ్రెస్ పార్టీలో కొత్త నర్సింహారెడ్డి, తమ్మాలి మణయ్య తో పనిచేస్తున్నపుడు వారు తనలోని ఆలోచన శైలి,వాక్ చాతుర్యాన్ని పసిగట్టరని, గతంలో తాను చేసిన అనేక సేవా కార్యక్రమాలు పరిగణనలోకి తీసుకుని గ్రామా అధ్యక్షుడుగా గ్రామస్తుల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. పార్టీలోకి రాక మునుపే తన సొంత నిధులతో గ్రామంలో బసంత్ సహని ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని, వేసవికాలంలో చలివేంద్రం, మరియు గతంలో మాజీ సర్పంచ్ గెలుపులో తన పాత్ర కీలకమని పేర్కొన్నారు. 2017లోనే నాయకులు ఉప్పరి శ్రీనివాస్‌తో కలిసి అంబేద్కర్ సంఘంలో అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేశామని వివరించారు. 2018లో ఫోన్లో ఒక గ్రూపులో కొనసాగిన డిబేట్ ద్వారా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కర్రోళ్ల సత్యం పరిచయం ఏర్పడిందని, కర్రోల సత్యం మాటాలు తనను పూర్తి ప్రభావితం చేశాయని, అంబేద్కర్ అడుగుజాడల్లో ఆశయసాధన పనిచేయడం అంటే మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం కాదని, చీకటిలో మగ్గి పోతు, ముగిసిపోతున్న జాతి బిడ్డల జీవితాలను అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే లక్ష్యంతో నడుస్తున్న స్వేరోలో బలహీనంగా బానిస బతుకుల్లో మనం స్వేరో జెండా రెపరేలాడేలా చేయాలని, విద్య కోసం మాత్రమే పనిచేస్తున్న స్వేరో కమిటీని పటిష్టం చేసేలా పనిచేద్దాం అన్నా పిలుపును అందుకుని స్వేరో సర్కిల్ లోకి రావడం జరిగిందని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందేశాలు తనను పూర్తిగా మార్చి వేసిందని ఆ మాటాలు తనను తాను ప్రశ్నించు కునేలా ఆలోచిం పజేశాయని అన్నారు. అప్పుడు తనలో సంతప్తి దిశ నిర్ధేశం కలిగిందని మారుమూల కుగ్రామంలో ఉన్న జాతి బిడ్డలు మాలవత్ పూర్ణ,ఆనంద్ కుమార్ లాంటి వారు నా గ్రామం నుండి ఎందుకు రాకూడదనే అంతర్మధనం కలిగిందని అన్నారు.స్వేరో సర్కిల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాలుగు మండలాలకు ఇన్చార్జిగా పనిచేస్తునని, ప్రతి టీం 15 మంది ఏర్పాటు ఉంటారని, అందులో స్వేరో సర్కిల్ జిల్లా అధ్యక్షుడు లింగం,బంటు లక్ష్మీ సుజాత టీజీపీఏ జిల్లా విమెన్ అధ్యక్షురాలు బాధ్యత యుతంగా పనిచేస్తూ తమ విజయంలో వీరి పాత్ర ,సహకారం కీలకమన్నారు. గ్రామగ్రామాల్లో ఆర్థికంగా నలిగిపోతు చదువుకు దురమవుతున్న జాతి బిడ్డలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఎలాంటి అవరోధాలు అడ్డొచ్చినా ఎదురించి ముందుకు సాగుతానని అందుకు స్వేరో ప్రవీణ్ కుమార్ ఆదర్శమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కూడా తనకు మరో కన్నులాంటిదని పార్టీ సభ్యులందరి నుండి తనకు పూర్తి మద్దతు ఉందని, తాను అభిమానించే కాంగ్రెస్ పార్టీ కోసం కూడా శక్తి వంచన లేకుండా శ్రామిస్తానని, పార్టీ అభివద్ధి కోసం కషి చేస్తానని, తనకు ఎల్లవేళలా సపోర్ట్ చేసే జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు షాబాద్ దర్శన్, తమ్మాలి మణయ్య తో కలిసి పార్టీ అభివద్ధి కోసం ముందుంటానని ఆయన తెలిపారు.