Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫణికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ విచ్చేసి మాట్లాడుతూ తెలుగు సంవత్సరానికి ఉగాది సందర్భంగా దేవాలయాల సందర్శన , కవిసమ్మేళనాలకు హాజరవటం సనాతన సంప్రదాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని ఆశిస్తూ మొదటిరోజున ఈ ఉత్సవాలతో ఉత్సాహంగా గడిపితే సంవత్సరమంతా తీపి గుర్తులతో ఆనందంగా గడు స్తుందని అందుకే, ఈ ఉగాది వేడుకలు జరుపుకొంటారని వివరించారు. సంగీత, సాహిత్యాలకు మరింత ఆధరణ పొందే విధంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కవులు వివిధ సామాజిక అంశాలపై తమ కవితా గానాన్ని వినిపించారు. కవులకు పుష్పగుచ్ఛం అందించి, శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రజలందరికి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు సహదేవ్ , గణపతి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు , మల్లేష్ , నల్లగొర్ల శ్రీనివాసరావు , పాలం శ్రీనివాస్ పాల్గొన్న కవులు మావిశ్రీ మాణిక్యం , కష్ణ గౌడ్, చమత్కార కవి కామేశ్వరరావు , ఎం నారాయణరావు , శ్రీమతి రజనీ కులకర్ణి , మమత తదితర కవులు పాల్గొన్నారు.