Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు రేవతిరెడ్డి, షాదాబ్
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలో 19 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు రేవతిరెడ్డి, షాదాబ్ అన్నారు. మంగళవారం శంకర్పల్లి ప్రభుత్వాస్పత్రిలో 69మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 60మందికి నెగటివ్ వచ్చిందనీ, 9మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. హైదరాబాద్ రోడ్డు 1 , బుల్క పూర్లో 1, పొద్దుటూరులో 1, పత్తిపూర్ గ్రామంలో 1, జనవాడ గ్రామంలో 1, సంకేపల్లి గ్రామంలో 1, మహాలింగాపూర్ గ్రామంలో 1, , ఎలవర్తి గ్రామంలో 1, పరివేదలో 1, పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు.అదేవిధంగా టంగటూరు ప్రభుత్వాస్పత్రిలో 69మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్ ఎస్జే పీబీ తెలిపారు. మోకిలాతండాలో 3, టంగటూరు గ్రామంలో 2, పిల్లిగుండ్లలో 1, వీర్లపల్లిలో 1, జన్వాడలో 1, రిలేయన్స్లో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. వీరితో పాటు ఎంపీహెచ్వో శ్రీనివాస్ తదితరులున్నారు.