Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి సీఐ గోపీనాథ్ అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండలంలోని బస్టాండ్ సమీపంలో పండ్ల మార్కెట్ ఆవరణలో ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత కరోనా వైరస్ విజంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిం చాలన్నారు. ఒకరికొకరు సెకండ్ ఇవ్వకుండా చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలని సూచించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని చెప్పారు. వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నా, మాస్కు తప్పనిసరిగా ధరించాలని కోరారు. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్లాలన్నారు. మాస్కులు ధరించికుండా బయటకు వస్తే, రూ. వేయ్యి లు జరిమానా విధించనున్నట్టు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబం ధనలు పాటించాలని కోరారు. పండ్లు కూరగాయలు అమ్మే వారు కూడా మాస్కులు తప్పక ధరించాలన్నారు. అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం చేసేవారు తప్పక ధరించాలని లేకపోతే కంట్రోలర్ లేదా కండక్టర్ బాధ్యత తీసుకోవాలన్నారు. మూడు నెలల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మినారాయణ తదితరులున్నారు.